calender_icon.png 24 January, 2025 | 6:38 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నిర్మలా సీతారామన్‌తో చంద్రబాబు భేటీ

24-01-2025 02:05:09 PM

న్యూఢిల్లీ: దావోస్ పర్యటన విజయవంతంగా ముగించుకుని దేశానికి తిరిగి వచ్చిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు(N. Chandrababu Naidu ) శుక్రవారం నాడు ఢిల్లీలో కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్(Union Finance Minister Nirmala Sitharaman)తో భేటీ అయ్యారు. వీరి సమావేశంలో రాష్ట్రానికి సంబంధించి పెండింగ్‌లో ఉన్న పలు అంశాలపై చంద్రబాబు చర్చించి ఆర్థిక సాయం అందించాలని కోరారు. అమరావతి కోసం హడ్కో రుణం, ప్రపంచబ్యాంకు నిధులు తదితర అంశాలు చర్చలో ప్రధానంగా ప్రస్తావించబడ్డాయి.

అనంతరం మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌(Former President Ram Nath Kovind)తో చంద్రబాబు భేటీ కానున్నారు. ఆ తర్వాత కేంద్ర మంత్రులు శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌, ప్రహ్లాద్‌ జోషిలతో చర్చలు జరపనున్నారు. ఢిల్లీలో పర్యటన షెడ్యూల్ ముగించుకుని చంద్రబాబు శుక్రవారం సాయంత్రం విజయవాడకు చేరుకునే అవకాశం ఉంది. ఇటీవల దావోస్‌లో జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్(Davos World Economic Forum) సదస్సుకు చంద్రబాబు(Chandrababu) నాలుగు రోజుల పాటు హాజరు కావడం గమనార్హం. అంతర్జాతీయ పర్యటన ముగించుకుని గురువారం అర్థరాత్రి ఢిల్లీ చేరుకున్నారు.

సీఎం చంద్రబాబు, ఐటీ మంత్రి లోకేష్(IT Minister Nara Lokesh) నేతృత్వంలో బృందం దావోస్ వెళ్ళి 30 లక్షల కోట్ల పెట్టుబడుల సమీకరణ కోసం ఏపీ బ్రాండ్‌(AP Brand)ని ప్రమోట్ చేయడంతో పాటు ఏపీలో అనుకూలతలను పారిశ్రామికవేత్తలకు, వివిధ దేశాల ప్రతినిధులకు, ప్రఖ్యాత సంస్థల సీఈవోలకు వివరించారు. మంత్రి నారా లోకేష్ పుట్టినరోజు అయినప్పటికీ సదస్సుకు ఆఖరి రోజు కావడంతో రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ఎటువంటి బర్త్ డే సెలబ్రేషన్స్, వ్యక్తిగత కార్యక్రమాలు లేకుండా పూర్తి సమయాన్ని సంస్థల ప్రతినిధులతో చర్చలకే కేటాయించారు.