పార్లమెంట్ సమావేశాల్లో చర్చించాల్సిన అంశాలపై పలు సూచనలు
హైదరాబాద్, జూలై 20 (విజయక్రాంతి): టీడీపీ సమావేశం శనివారం చంద్రబాబు నాయడు ఆధ్వర్యంలో ఉండవల్లిలోనిఆయన నివాసంలో జరిగింది. ఈ సమావేశంలో పార్టీ ఎంపీలు, మంత్రులు పాల్గొన్నారు. ముఖ్యమైన అంశాలపై చర్చించారు. ఈ నెల 22న పార్లమెంట్‌లో అనురించాల్సిన వ్యూహాలు, లేవనెత్తాల్సిన అంశాలపై చంద్రబాబు ఎంపీలకు దిశానిర్దేశం చేశారు. కేంద్రంలో వివిధ మంత్రిత్వశాఖల నుంచి తెచ్చుకోవాల్సిన నిధులు, వివిధ పథకాల ద్వారా మరింత ప్రయోజనం పొందేందుకు చేయాల్సిన కృషిపై సూచనలు చేశారు.
అమ రావతి, పోలవరం వంటి ప్రాజెక్టులకు కేంద్ర ప్రభుత్వ సాయం వంటి అంశాలపైవారితో చర్చించారు. కేంద్రంతో సమన్వయం కోసం ఒకొక్క ఎంపీకి ఇప్పటికే కొన్ని శాఖల చొప్పు న బాధ్యతలను అప్పగించిన విషయం తెలిసిందే. రాష్ట్రానికి అత్యంత ప్రాధాన్యత అంశాలైన అమరావతి, పోలవరంకు నిధుల సాధనపై చర్చించారు. జల్‌జీవన్ మిషన్, క్రిషి సంచాయి యోజనన కింద రాష్ట్రానికి మెరుగైన సాయంపై చర్చించారు.