calender_icon.png 16 January, 2025 | 6:29 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సతీమణి కోసం చీరలు కొన్న చంద్రబాబు

08-08-2024 01:46:59 AM

భువనేశ్వరి కోసం వెంకటగిరి, ఉప్పాడ చీరలు

హైదరాబాద్, ఆగస్టు 7 (విజయక్రాంతి): నిత్యం ప్రజా సేవలో బిజీగా ఉండే మంత్రులు, ముఖ్యమంత్రులు వారి సతీమణుల కోసం షాపింగ్ చేయడం పెద్దగా కనిపించదు. అయితే తాజాగా ఏపీ సీఎం చంద్రబాబు తన సతీమణి నారా భువనేనశ్వరి కోసం రెండు చీరలను కొనుగోలు చేశారు. బుధవారం చేనేత దినోత్సవం సందర్భంగా విజయవాడలో ఏర్పాటు చేసిన చేనేత ఎగ్జిబిషన్‌ను చంద్రబాబు ప్రారంభించారు.

స్టాల్స్ అన్నీ కలియదిరిగిన బాబుకు తన భార్యకు చీరలు కొనాలనే ఆలోచన వచ్చింది. వెంటనే ఇక్కడ ఉన్న మంచి చీరలు ఏవీ అంటూ ఆరా తీశారు. చేనేత కార్మికులతో మాట్లాడిన అనంతరం వెంకటగిరి, ఉప్పాడ చీరలను కొనుగోలు చేశారు. చేనేత కార్మికులు ఎంతో కష్టపడి అందమైన చీరలను నేస్తారని ఈ సందర్భంగా సీఎం ప్రశంసించారు. వారి కళానైపుణ్యం అద్భుతమని కొనియాడారు. ప్రతి ఒక్కరూ చేనేత వస్త్రాలను ధరించి వారికి అండగా నిలబడాలని పిలుపునిచ్చారు.