20-04-2025 07:45:58 PM
పినపాక (విజయక్రాంతి): ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు 75వ పుట్టినరోజు వేడుకలు ఆదివారం మండలంలో ఘనంగా నిర్వహించారు. పినపాక మండల తెలుగు దేశం పార్టీ అధ్యక్షులు తోట వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు 75వ పుట్టినరోజు కేక్ కటింగ్ చేసి స్వీట్లు పంచారు. అనంతరం ఆయన పరిపాలనా విధానాన్ని, అమలు పరచిన పథకాల గురించి కొనియాడారు.
విజనరీ పాలన దక్షత కలిగిన నాయకుడిగా ఆయన ఇరు రాష్ట్రాల అభివృద్ధి కోసం చేసిన సేవలు, హైదరాబాద్ అభివృద్ధి ఆయన కృషే అన్నారు. అనంతరం ఆయన ఆరోగ్యంగా ఉండాలని, తెలంగాణలోనూ సీఎం చంద్రబాబు నాయుడు సేవలు కావాలని కోరుతూ పూజలు జరిపించారు. ఈ కార్యక్రమంలో పినపాక మండల తెలుగు దేశం పార్టీ అధ్యక్షులు తోట వెంకటేశ్వరరావు, కోడిరెక్కల సత్యం, కొడిరెక్కల సమ్మయ్య, రెబ్బల వీరమోహన్ రావు, షేక్ నభి సాహెబ్, షేక్ పెంటు సాహెబ్ తదితరులు పాల్గొన్నారు.