20-04-2025 07:51:41 PM
ఇల్లెందు (విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మండలం కరెంట్ ఆఫిస్ సెంటర్లో టీడీపీ ఇల్లందు నియోజకవర్గ నాయకులు పుట్టా ఉపేందర్ యాదవ్, క్లింటు రోచ్ ల ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు ఆదివారం ఘనంగా నిర్వహించారు. పుట్టా ఉపేందర్ యాదవ్ మాట్లాడుతూ.. స్వర్ణ ఆంధ్రప్రదేశ్ సృష్టి కర్త, అలుపెరగని పోరాట యోధుడు, అభివృద్ధి ప్రదాత, సంపద సృష్టి కర్త, జనం మెచ్చిన నాయకుడు, అలుపెరుగని చంద్రుడు నారా చంద్రబాబు నాయుడు అని కొనియాడారు. కెకు కట్ చేసి అక్కడ వ్యాపారులకు కేకు, స్విట్స్, పండ్లు, బిసికేటేస్ పంపిణీ చేశారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో టిడిపి పోటీ చేసే అవకాశం ఉంది కాబట్టి ప్రతి ఒక్క కార్యకర్త సిద్ధంగా ఉండలన్నారు.
అదేవిధంగా 2029 లో జరిగే అసెంబ్లీ ఎన్నికలలో తెలంగాణలో టిడిపి అధికారం కైవసం చేసుకుంటుందని అన్నారు. ప్రతి ఒక్క కార్యకర్త సైనికుడిలా పనిచేయాలి అన్నారు. రానున్న రోజులలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రములో లాగా తెలంగాణలో కూడా కుటమి ఉండే పరిస్థితి ఉందన్నారు. కాబట్టి తెలంగాణలో అధికారం కైవసం చేసుకునె పరిస్థితి ఉందని, ప్రతి ఒక్కరూ ఇప్పటి నుండే చురుకుగా పని చెయ్యాలన్నారు. ఈ కార్యక్రమంలో గుళ్ళ మొగిలి, అంజి, ఉదయ్, రమేష్, శంకర్, వెంకన్న, ప్రసాద్, సన్నీ, బాలాజీ నగర్ గ్రామ పంచాయతీ మాజీ వార్డు సభ్యులు పుట్టా అరుణ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.