అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రజలు భోగి పండుగను అత్యంత ఉత్సాహంగా జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు(Chief Minister Nara Chandrababu Naidu), మంత్రి నారా లోకేష్ సోషల్ మీడియా ద్వారా ప్రజలకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. పవిత్రమైన ఈ భోగి పండుగ మీకు, మీ కుటుంబానికి కొత్త వెలుగులు తేవాలని, పాత బాధలు పోయి సానుకూల దృక్పథంతో జీవితంలో ముందుకు సాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. భోగి మంటలతో మీ సమస్యలన్నీ తీరిపోయి మీకు భోగ భాగ్యాలు కలగాలని ఆకాంక్షిస్తున్నాను. మీ ఆశలు, ఆశయాలూ తీర్చడానికి ప్రజాప్రతినిధులుగా మేం అన్ని వేళలా మీతోనే ఉంటామని ఈ సందర్భంగా హామీ ఇస్తున్నానని ఏపీ సీఎం పేర్కొన్నారు.
మంత్రి నారా లోకేష్(Minister Nara Lokesh) కూడా తన సందేశంలో ''తెలుగు ప్రజలందరికీ భోగి పండుగ శుభాకాంక్షలు. సంక్రాంతికి ముందు రోజు జరుపుకునే వేడుక భోగి. ఈ భోగి భోగభాగ్యాలతో పాటు మీ జీవితంలో కొత్త వెలుగులు నింపాలని కోరుకుంటున్నాను. శీతాకాలపు చల్లటి గాలులను చీల్చుతూ వెలిగించే భోగి మంటలు మీ జీవితంలో సరికొత్త కాంతులు తీసుకురావాలి. భోగిమంటల్లో ఏవిధంగా పాతదనం కాలిపోయిందో.. మీ జీవితంలో కూడా ఆటంకాలన్నీ తొలగిపోయి సకల శుభాలు జరగాలి. మీరు తలపెట్టిన ప్రతి పనిలో విజయం సాధించాలని కోరుకుంటూ అందరికీ భోగి పండుగ శుభాకాంక్షలు''. తెలిపారు.