గోండా: ఉత్తరప్రదేశ్‌లోని గోండా జిల్లాలో గురువారం చండీగఢ్-దిబ్రూగఢ్ ఎక్స్‌ప్రెస్‌కు చెందిన 4 ఏసీ బోగీలతో సహా 12 బోగీలు పట్టాలు తప్పడంతో బోల్తా పడ్డాయి. ఈ ప్రమాదంలో గాయపడిన వారి సంఖ్య ఇంకా తెలియాల్సిఉంది. గోండా- మంకాపూర్ మార్గంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ గోండా జిల్లాలో జరిగిన రైలు ప్రమాదం గురించి తెలుసుకున్న తక్షణమే సహాయక చర్యలు చేపట్టాలని ఆదేశించారు. బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని తెలిపారు. ఘటనాస్థలిలో ప్రస్తుతం సహాయ చర్యలు కొనసాగుతున్నాయి.