calender_icon.png 1 November, 2024 | 7:58 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఉత్తరప్రదేశ్లో పట్టాలు తప్పిన రైలు.. నలుగురు మృతి

18-07-2024 08:27:55 PM

గోండా: ఉత్తరప్రదేశ్‌లో రైలు ప్రమాదం జరిగింది. గోండా జిల్లాలో గురువారం చండీగఢ్‌-దిబ్రూగఢ్‌ ఎక్స్‌ప్రెస్ రైలు పట్టాలు తప్పింది. గోండా మన్కాపూర్ సెక్షన్ లో ఈ ప్రమాదం జరిగింది. చండీగఢ్‌-దిబ్రూగఢ్‌ ఎక్స్‌ప్రెస్ చెందిన 4 ఏసీ కోచ్ లతో సహా 8 బోగీలు పట్టాలు తప్పి పక్కనే ఉన్న పంట పొలాల్లోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందగా, 20 మందికి గాయలు అయ్యాయి. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను చికిత్స నిమిత్తం స్థానిక దవాఖానకు తరలించారు.

మృతదేహాలను స్వాధీనం చేసుకుని శవ పరీక్ష నిమిత్తం మార్చరి తరలించారు. ఈ విషాద ఘనటపై స్పందించిన రైల్వేశాఖ మృతులు కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున పరిహారం, తీవ్రంగా గాయపడిన వారికి రూ.2.5 లక్షలు, స్వల్పంగా గాయపడిన వారికి రూ.50 వేల చొప్పున పరిహారం ప్రకటించింది. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ గోండా జిల్లాలో జరిగిన రైలు ప్రమాదంలో మరణించిన కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఘటనాస్థలిలో సహాయక చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని తెలిపారు.  ప్రమాద వివరాల కోసం హెల్ప్ లైన్లు ఏర్పాటు చేసిన రైల్వేబోర్డు ఘటనపై ఉన్నతస్థాయి విచారణకు ఆదేశించింది.