05-04-2025 08:19:04 PM
తాడ్వాయి (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండల కేంద్రంలోని శ్రీ శబరిమాత ఆశ్రమంలో శనివారం ఆశ్రమ నిర్వాహకులు చండీయాగం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వేద పండితుల మంత్రోచ్ఛరణల మధ్యన చండీయాగం నిర్వహించారు. హోమం కాలుస్తూ వేద మంత్రాలు ఉచ్చరించారు ఈ సందర్భంగా శ్రీ శబరిమాత భక్తులు చండీయాగములో పాల్గొని అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అక్కడే ఏర్పాటు చేసిన ప్రత్యేక అన్నదాన కార్యక్రమంలో పాల్గొని భోజనం చేశారు. ఈ కార్యక్రమంలో ఆశ్రమ కమిటీ నిర్వాహకులు గ్రామ పెద్దలు యువకులు పాల్గొన్నారు.