calender_icon.png 26 December, 2024 | 9:00 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దిల్‌ను కొల్లగొట్టే చందమామ

08-11-2024 12:00:00 AM

బాలీవుడ్ ముద్దుగుమ్మ అనన్య పాండే ఓ సినిమాకు సైన్ చేశారు. ‘చాంద్ మేరా దిల్’ అనే సినిమాలో ఆమె నటించనున్నారు. ఈ విషయాన్ని కరణ్ జోహార్ స్వయంగా ప్రకటించారు. ఈ చిత్రంలో లక్ష్య, అనన్య పాండే జంటగా నటిస్తున్నారు. మంచి ప్రేమకథా చిత్రంగా ఇది రూపొందనుంది. ఈ సినిమా టైటిల్‌ను ప్రకటిస్తూ చిత్రబృందం అద్భుతమైన పోస్టర్‌ను విడుదల చేసింది.

వెన్నెల వెలుగులో ఓ నది ఒడ్డున లక్ష్య, అనన్య పాండే కూర్చొని కబుర్లు చెప్పుకుంటున్న దృశ్యంతో పోస్టర్‌ను వదిలారు. “మీరిప్పటి వరకూ చూడని ఒక అద్భుతమైన ప్రేమ కథను మీ ముందుకు ఆవిష్కరించేందుకు మా రెండు చందమామలు సిద్ధం” అంటూ చిత్రబృందం పోస్ట్ పెట్టింది.

వివేక్ సోని ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. లక్ష్యతో తొలిసారిగా అనన్య జత కడుతున్నారు. ఈ పోస్టర్‌ను చూసిన అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి లక్ష్య దిల్‌ని కొల్లగొట్టే చందమామగా అనన్య అలరించనున్నారు.