ముంబై: ముంబై జట్టు యువ ఆటగాడు తనుష్ కొటియన్‌కు బీజీటీలో ఆడే అవకాశం వచ్చింది. సీనియర్ స్పిన్నర్ రవిచం ద్రన్ అశ్విన్ సిరీస్ మధ్యలో రిటైర్మెంట్ ప్రకటించడంతో బీసీసీఐ అశ్విన్ స్థానంలో 26 ఏళ్ల స్పిన్నర్ తనిష్‌ను ఎంపిక చేసింది. ప్రస్తుతం విజయ్ హజారే ట్రోఫీలో ముంబైకి ప్రాతినిధ్యం వహిస్తున్న కొటియన్ అదరగొడుతున్నాడు. బౌలింగ్‌తో పాటు బ్యాటింగ్‌లో కూడా సత్తా చాటే కొటియన్ జట్టు విజయా ల్లో కీలకపాత్ర పోషిస్తున్నాడు.
రంజీ ట్రో ఫీతో పాటు ప్రస్తుతం జ రుగుతున్న విజయ్ హజారే ట్రోఫీలో కూడా సత్తా చాటుతున్నాడు. దీంతో అతడికి జాతీయ జట్టు నుంచి పిలుపు వచ్చిం ది. జట్టు నుంచి పిలు పు ఐతే వచ్చింది కానీ తుది జట్టులో కొటియన్‌కు చోటు దక్కేది మా త్రం అనుమానమే.