బ్యారేజ్ ను పరిశీలించిన మాజీ మంత్రి రామన్న....
ఆదిలాబాద్ (విజయక్రాంతి): వ్యవసాయ రైతులకు ఆధారమైన చనాక కోరాట బ్యారేజ్ పై కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుందని మాజీ మంత్రి జోగు రామన్న అన్నారు. జైనథ్ మండల కేంద్రంలో ఆదివారం పార్టీ శ్రేణులతో కలిసి అయన విస్తృతంగా పర్యటించారు. మొదట పంట క్షేత్రాలను పరిశీలిస్తూ రైతులను సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం చనాక కొరటా బ్యారేజ్ తో పాటు పంప్ హౌస్ ను సందర్శించారు. బ్యారేజ్ పై కాంగ్రెస్ ప్రభుత్వం చూపిస్తున్న నిర్లక్ష్యంపై మండిపడ్డారు. ఈ మేరకు జోగు రామన్న మాట్లాడుతూ... కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతులు తీవ్ర అవస్థలు పడుతున్నారన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో రైతాంగ సమస్యలకు పరిష్కారాన్ని చూపెడుతూ 60 వేల ఎకరాలకు సాగునీరు అందించాలని ఉద్దేశంతో మాజీ సీఎం కేసీఆర్ చనాక కోట బ్యారేజ్ నిర్మాణాన్ని చేపట్టారన్నారు. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యంతో బ్యారేజ్ పనులు మధ్యలోనే ఆగిపోవడం జరిగిందని, పెండింగ్ బకాయిలను విడుదల చేసి పంప్ హౌస్ పనులతో పాటు బ్యారేజ్ నిర్మాణాన్ని పూర్తి చేయాలని డిమాండ్ చేశారు.