calender_icon.png 19 April, 2025 | 4:17 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఘనంగా ఛాంపులాల్ జాతర

11-04-2025 01:26:18 AM

చివ్వెంల ,ఏప్రిల్ 10: మండ లంలోని పులితండ గ్రామపం చాయతీలోని (గుడితండా) లో జరుగుతున్న చాంపులాల్ జాత రలో తెలంగాణ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి, మాజీ మంత్రి, సూర్యాపేట శాసన సభ్యులు గుంటకండ్ల జగదీశ్ రెడ్డి వేరువేరుగాపాల్గొని సంప్రదాయ పద్దతిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.

వారికి గిరిజన యువతి యువకులు, పెద్ద ఎత్తున హాజరై స్వాగతం పలికారు. జాతరలో ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా ఎస్త్స్ర మహేశ్వర్ ఆధ్వర్యంలో బందోబస్తు ఏర్పాటు చేశారు.

ఈ జాతరలో సూర్యాపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ శ్రీనివాస్,తహసీల్దార్ కృష్ణయ్య, ఎంపీడీఓ సంతోష్ కుమార్, ఎంపీఓ దయాకర్, బిఆర్‌ఎస్  పార్టీ మండల అధ్యక్షులు  జూలకంటి జీవన్ రెడ్డి,మాజీ ఎంపీపీ కుమారి బాబునాయక్,రౌతు నరసింహ రావు ,ఎల్ ఎన్ రావు , అనిల్ నాయక్, గురువేందర్, నాగు నాయక్, బద్రు నాయక్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు, వ్యవసాయ మార్కెట్ డైరెక్టర్ ధరావత్ వీరన్న నాయక్, కాంగ్రెస్ నాయకులు రవి నాయక్, నర్సిరెడ్డి, గండికోట లక్ష్మయ్య,కాంగ్రెస్ పార్టీ నాయకులు, బి ఆర్ ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు..