calender_icon.png 6 January, 2025 | 2:07 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హైబ్రీడ్ మోడ్‌లో చాంపియన్స్ ట్రోఫీ!

06-12-2024 12:24:51 AM

ఈ నెల 7న తుది నిర్ణయం

న్యూఢిల్లీ: వచ్చే ఏడాది జరగనున్న ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ హైబ్రీడ్ మోడ్‌లో జరిగే అవకాశముంది. గురువారం దుబాయ్‌లో అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) కార్యాలయంలో కొత్త చైర్మన్ జై షా అధ్యక్షతన బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ల అనధికారిక సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ నిర్వహణ విషయం ప్రస్తావనకు వచ్చింది. పీసీబీ సహా 12 సభ్యదేశాల సభ్యులు హాజరైన సమావేశంలో చాంపియన్స్ ట్రోఫీని హైబ్రీడ్ మోడ్‌లో నిర్వహించాలనే నిర్ణయానికి ఐసీసీ వచ్చింది.

ఈ శనివారం ఐసీసీ తుది నిర్ణయం తీసుకోనుంది. ‘2025 చాంపియన్స్ ట్రోఫీ పాకి స్థాన్, యూఏఈ ఆతిథ్యమివ్వనున్నాయి. భారత్ తమ మ్యాచ్‌లను దుబాయ్‌లో ఆడనుంది. అయితే 2031 వరకు ఉపఖండంలో జరిగే ఐసీసీ టోర్నీలను హైబ్రీడ్ మోడ్‌లో నిర్వహించాలంటూ పీసీబీ డిమాండ్ చేసింది. 2027 వరకు జరిగే అన్ని టోర్నీలు హైబ్రీడ్ మోడ్‌లో జరిగేలా చూస్తామని హామీ ఇచ్చాం’ అని ఐసీసీ అధికారి ఒకరు పేర్కొన్నారు. దీంతో ఫిబ్రవరి జరగనున్న చాంపియన్స్ ట్రోఫీకి సంబంధించి రెండు రోజుల్లో పూర్తి షెడ్యూల్ ప్రకటించే అవకాశముంది.