calender_icon.png 4 March, 2025 | 6:45 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఛాంపియన్స్ ట్రోఫీ తొలి సెమీస్: రెండో వికెట్ కోల్పోయిన ఆస్ట్రేలియా

04-03-2025 03:52:29 PM

ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ-2025(ICC Champions Trophy 2025) తొలి సెమీస్ ప్రారంభమైంది. టాస్ గెలిచిన ఆస్ట్రేలియా(Australia) బ్యాటింగ్ ఎంచుకుంది. టీమిండియా వరుసగా 14వ సారి టాస్ కోల్పోవడం విశేషం. ఆస్ట్రేలియా జట్టు 4 పరుగుల వద్ద కూపర్కనోలి డౌకౌట్ కాగా, జోరు మీదున్న ట్రావిస్ హెడ్(39)ను వరుణ్ చక్రవర్తి ఫెవిలియన్ కు పంపాడు. బౌలింగ్ కు వచ్చీ రాగానే వరుణ్ చక్రవర్తి బంతికే వికెట్ తీసుకున్నాడు. వరుణ్ చక్రవర్తి(Varun Chakaravarthy)ని తక్కువ అంచనా వేసి, అతడి బౌలింగ్ లో  భారీ షాట్ ఆడేందుకు ప్రయత్నించిన ట్రావిస్ హెడ్ గిల్ కు క్యాచ్ ఇచ్చి  అవుట్ అయ్యాడు. 33 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్ లు కొట్టాడు ట్రావిస్ హెడ్, ప్రస్తుతం  ఆస్ట్రేలియా 16 ఓవర్లకు 82 పరుగులు చేసి రెండు వికెట్లు కోల్పోయింది. క్రీజులోకి స్టీవ్ స్మిత్ 35 బంతుల్లో(27), లబుషేన్19 బంతుల్లో (10) పరుగులతో నిలకడగా ఆడుతున్నారు.