calender_icon.png 9 March, 2025 | 6:09 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నేడు చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్

09-03-2025 12:17:13 AM

  1. భారత్, న్యూజిలాండ్ మధ్య టైటిల్ పోరు
  2. దుబాయ్ వేదికగా మధ్యాహ్నం 2.30 నుంచి
  3. 25 ఏళ్ల ఓటమికి బదులు తీర్చుకునేనా?

దుబాయ్, మార్చి 8: ప్రతిష్ఠాత్మక ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ చివరి అంకానికి చేరుకుంది. దుబాయ్ వేదికగా నేడు జరగనున్న ఫైనల్లో భారత్, న్యూజిలాండ్ అమీతుమీకి సిద్ధమయ్యాయి.మధ్యాహ్నం 2.30 నుంచి మ్యాచ్ ప్రారంభం కానుంది. టోర్నీలో ఆడి న నాలుగు మ్యాచ్‌ల్లోనూ విజయాలు సాధించి టీమిండియా ఫైనల్లో అడుగుపెట్టగా.. సెమీస్‌లో సౌతాఫ్రికాపై విజయం తో కివీస్ తుది పోరుకు అర్హత సాధించింది.

లీగ్ దశలో  భారత్ 44 పరుగుల తేడా తో న్యూజిలాండ్‌పై నెగ్గిన సంగతి తెలిసిందే. అంతేకాదు వరుసగా నాలుగు మ్యా చ్‌లు దుబాయ్‌లోనే ఆడిన భారత్ పిచ్‌ను బాగా ఒంటపట్టించుకుంది. మొదట బ్యాటింగ్ లేదా బౌలింగ్ చేసినా ప్రత్యర్థిని ఎలా ఎదుర్కోవాలన్న దానిపై ఇప్పటికే వ్యూహాలు రచించింది.

దుబాయ్ పిచ్‌పై చేజింగ్ కష్టమని తెలిసినప్పటికీ భారత్ ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లో మూడింటిలో ఛేదన ద్వారానే విజయం సాధించడం విశే షం. ఎలా చూసుకున్నా ఫైనల్లో భారత్ ఫేవరెట్‌గా కనిపిస్తోంది. మరోవైపు ఐసీసీ పరిమిత ఓవర్ల క్రికెట్‌లో న్యూజిలాండ్ గెలిచిన ఏకైక ట్రోఫీ చాంపియన్స్ ట్రోఫీనే కావడం గమనార్హం.

అది కూడా 2000 సంవత్సరంలో భారత్‌పైనే విజయం సాధించి ట్రోఫీని ఎగరేసుకుపోయింది. ఆ తర్వాత 2009లో ఫైనల్ చేరినప్పటికీ రన్నరప్‌కే పరిమితమైంది. ఈ నేపథ్యంలో 25 ఏళ్ల క్రితం ఓటమికి బదులు తీర్చుకునే సదవకాశం భారత్ ముంగిట నిలిచింది. ఇప్ప టివరకు భారత్ రెండుసార్లు చాంపియన్స్ ట్రోఫీ (2002, 2013) గెలిచింది.