09-03-2025 11:39:18 AM
హైదరాబాద్,(విజయక్రాంతి): దుబాయ్ వేదికగా ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్ ఆదివారం జరుగనుంది. మధ్యాహ్నం 2.30 గంటలకు భారత్-న్యూజిలాండ్ మధ్య మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ ఐసీసీ ఛాంపియన్స్ టోర్నీలో భారత్ ఓటమన్నదే లేకుండా ఫైనల్ కు చేరుకుంది. లీగ్ దశలో న్యూజిలాండ్ పై విజయం సాధించిన టీమ్ ఇండియా ఐదోసారి, మూడోసారి న్యూజిలాండ్ ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ ఆడుతున్నాయి. 2000లో ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ లో భారత్ ను కివీస్ ఓడించింది. 2002లో మ్యాచ్ రద్దు కావడంతో భారత్-శ్రీలంక సంయుక్త విజేతలుగా నిలిచాయి. 2013లో ఇంగ్లాండ్ పై గెలిచి ఛాంపియన్స్ ట్రోఫీ విజేతగా నిలిచిన టిమ్ ఇండియా 2017లో పాకిస్థాన్ చేతిలో ఓడి రన్నరప్ గా గెలుపొందింది.
భారత్-న్యూజిలాండ్ మధ్య ఛాంపియన్స్ ట్రోఫీ పైనల్ మ్యాచ్ ఇవాళ మధ్యాహ్నం 2.30 గంటలకు ప్రారంభం కానుంది. ఐసీసీ టోర్నీలో 16 సార్లు తలపడిన భారత్-న్యూజిలాండ్ జట్లు, 16 మ్యాచ్ ల్లో భారత్ పై న్యూజిలాండ్ 10 సార్లు విజయం సాధించింది. నాకౌట్ మ్యాచ్ ల్లో 4 తలపడిన భారత్-న్యూజిలాండ్ జట్లు , భారత్ ను కివీస్ మూడు సార్లు ఓడించింది. ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ లో భారత్ గెలవాలని దేశవ్యాప్తంగా క్రికెట్ అభిమానులు వారణాసిలో పూజలు నిర్వహించారు. భారత్ గెలవాలని స్వామి చిదానంద సరస్వతి రుషికేష్ లో, అయోధ్యలోనూ సాధువులు పూజాలు చేశారు.