04-03-2025 04:20:16 PM
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ-2025(Champions Trophy2025) తొలి సెమీఫైనల్లో, టీమిండియా, ఆస్ట్రేలియా దుబాయ్‌లో తలపడనున్నాయి. టాస్ గెలిచిన ఆస్ట్రేలియా ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంది. టాస్ గెలిచిన జట్టుకు ముందుగా బ్యాటింగ్ చేయడం సరైన ఎంపిక అని పిచ్ నివేదిక కూడా సూచించింది. కాగా, ఛాపింయన్స్ ట్రోఫీ తొలి సెమీస్ లో ఆస్ట్రేలియా మూడో వికెట్ కోల్పోయింది. 110 పరుగుల వద్ద లబుషేన్(29)ఔట్ అయ్యాడు. జడేజా వేసిన అద్భుతమైన బంతికి (22.3ఓవర్)లో లబుషేన్ ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. జోష్ ఇంగ్లిస్ క్రీజులోకి వచ్చాడు. 25 ఓవర్లలో 125 పరుగులు చేసిన ఆసీస్ 3 వికెట్లు నష్టపోయింది. ప్రస్తుతం క్రీజులో స్టీవ్ స్మిత్ (44), ఇంగ్లిస్(7) పరుగులతో ఆడుతున్నారు.