* జాతీయ ఆర్చరీ చాంపియన్‌షిప్
జంషెడ్‌పూర్: జాతీయ ఆర్చరీ సీనియర్ చాంపియన్‌షిప్‌లో వ్యక్తిగత విభాగాల్లో దీపికా కుమారి, ధీరజ్ బొమ్మదేవర చాంపియన్లుగా నిలిచారు. శుక్రవారం జరిగిన మహిళల వ్యక్తిగత రికర్వ్ ఫైనలో పెట్రోలియం స్పోర్ట్స్ ప్రమోషన్ బోర్డ్ (పీఎస్‌పీబీ)కి ప్రాతినిధ్యం వహిస్తున్న దీపిక 6 అంకిత భాకత్‌పై విజయాన్ని సాధించి స్వర్ణం దక్కించుకుంది. కాగా దీపికకు టోర్నీలో ఇది రెండో స్వర్ణం. మిక్స్‌డ్ టీమ్ విభాగంలో తన భర్త అతాను దాస్‌తో కలిసి దీపిక పసిడి కైవసం చేసుకుంది. కాంస్య పతక పోరులో సిమ్రన్‌జీత్ కౌర్ 6 భార్గవిపై విజయం సాధించింది.
ఇక పురుషుల వ్యక్తిగత రికర్వ్ ఫైనల్లో సర్వీసెస్‌కు చెందిన ధీరజ్ 6 దివ్యాన్ష్ చౌదరీ (హర్యానా)పై సునాయాస విజయాన్ని అందుకున్నాడు. తొలి రెండు సెట్లలో వెనుకబడిన ధీరజ్ ఆ తర్వాత ఫుంజుకొని వరుస సెట్లలో విజయం సాధించడంతో మ్యాచ్‌ను గెలుచుకున్నాడు. కాంస్యం పోరులో అతుల్ వర్మ 7 అచ న్బా సింగ్‌పై విజయం సాధించాడు. పురుషుల టీమ్ ఈవెంట్ లో రైల్వేస్ జట్టు 6 హర్యానాను ఓడించి స్వర్ణం కొల్లగొట్టగా..రాజస్థాన్‌ను 4 మట్టికరిపించిన సర్వీసెస్ కాంస్యం దక్కించుకుంది. మహిళల టీమ్ ఈవెంట్‌లో జార్ఖండ్, మధ్య ప్రదేశ్, మహారాష్ట్ర వరుసగా స్వర్ణ, రజత, కాంస్యాలు గెలుచుకున్నాయి. మిక్స్‌డ్ టీమ్ విభాగంలో మధ్యప్రదేశ్ కాంస్యం సొంతం చేసుకుంది.