స్టాడ్ (స్విట్జర్లాండ్): భారత టెన్నిస్ ఆటగాడు యూకీ బాంబ్రీ స్విస్ ఓపెన్ ఏటీపీ-250 టోర్నీ టైటిల్ కైవసం చేసుకున్నాడు. ఆదివారం జరిగిన పురుషుల డబుల్స్ ఫైనల్లో యూకీ బాంబ్రీ-అల్బానో ఒలివెట్టి (ఫ్రాన్స్) ఓడీ 3-6, 6-3, 10-6తో ఫ్యాబ్రిక్ మార్టీన్-ఉగో హంబర్ట్ (ఫ్రాన్స్) ద్వయంపై విజయం సాధించింది. మూడో సీడ్‌గా బరిలోకి దిగిన బాంబ్రీ జోడీ.. తొలి సెట్‌లో ఓడి వెనుకంజలో నిలిచినా.. ఆ తర్వాత వరుస సెట్లలో సత్తాచాటింది. 32 ఏళ్ల బాంబ్రీకి ఇది మూడో ఏటీపీ టైటిల్ కావడం విశేషం. ఈ ప్రదర్శనతో బాంబ్రీ డబుల్స్ ర్యాంకింగ్స్‌లో ముందంజ వేయనున్నాడు.