ఆమ్‌స్టర్‌డామ్: ప్రపంచ చాంపియన్, భారత గ్రాండ్‌మాస్టర్ గుకేశ్ దొమ్మరాజు సుదీర్ఘ విరామం తర్వాత బరిలోకి దిగనున్నాడు. నేటి నుంచి స్విట్జర్లాండ్ వేదికగా మొదలుకానున్న టాటా స్టీల్ చెస్ టోర్నీలో పాల్గొంటున్న గుకేశ్ శనివారం తొలి మ్యాచ్ ఆడనున్నాడు.
‘వింబుల్డన్ ఆఫ్ చెస్’గా పేర్కొనే టాటా స్టీల్ చెస్ టోర్నీలో భారత్ నుంచి ఐదుగురు ఆటగాళ్లు బరిలోకి దిగనున్నారు. గుకేశ్‌తో పాటు తెలంగాణ గ్రాండ్‌మాస్టర్ అర్జున్ ఇరిగేసి, ఆర్.ప్రజ్ఞానంద, హరిక్రిష్ణ, లూక్ మెండోన్కా పోటీలో ఉండగా.. మహిళల విభాగంలో దివ్య దేశ్‌ముఖ్, ఆర్.వైశాలీ బరిలో ఉన్నారు.