21-04-2025 01:26:25 PM
మహబూబాబాద్,(విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లా కేసముద్రం పట్టణం(Kesamudram town)లో నూతనంగా ఫైర్ స్టేషన్ మంజూరు చేయించినందుకు కృషిచేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్య సలహాదారుడు, మహబూబాబాద్ మాజీ ఎమ్మెల్యే వేం నరేందర్ రెడ్డిని సోమవారం కేసముద్రం చాంబర్ ఆఫ్ కామర్స్ ప్రతినిధులు సన్మానించారు. కేసముద్రం మండలం అర్పణ పల్లి గ్రామంలో వేం నరేందర్ రెడ్డి స్వగృహానికి రాగా ఛాంబర్ ప్రతినిధులు సోమవారం అక్కడికి వెళ్లి వేం నరేందర్ రెడ్డిని సత్కరించారు. అనేక సంవత్సరాలుగా కేసముద్రం పారిశ్రామిక ప్రాంతంలో అగ్ని ప్రమాదాలు సంభవించి సకాలంలో అడ్డుకోలేక పోవడంతో, అనేక మంది వ్యాపారులు, పారిశ్రామికవేత్తలు ఆర్థికంగా నష్టపోయారని, కేసముద్రంలో ఫైర్ స్టేషన్ మంజూరు చేయడం వల్ల ఇప్పుడు తమకు అగ్ని ప్రమాద ఘటనల నుండి కాపాడుకునే పరిస్థితి కల్పించినందుకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.