calender_icon.png 23 February, 2025 | 9:07 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భైరాన్‌పల్లిలో చాళుక్యుల నాటి శిల

16-02-2025 12:00:00 AM

సిద్దిపేట జిల్లా దూల్మిట్ట మండలంలోని భైరాన్‌పల్లిలో పురాతన శిల ఉంది. గ్రామంలోని పురాతన జైన ఆలయంలో ఈ శిల బయటపడింది. శిలను పరిశీలించిన చరిత్రకారులు అది చాళుక్యుల కాలం నాటిదని,  ఈ శిల జైన చౌముఖి శిల్పం అని, ఐదు అడుగుల ఎత్తుతో చెక్కారని పేర్కొన్నారు. నలువైపులా ఉన్న శిల్పాలు 24వ జైన తీర్థంకరుడు మహావీరుడి ధ్యానం చేస్తున్నట్లుగా ఉన్నాయి.

గతంలో ఈ తరహా శిల్పాలు కొలనుపాక, వేములవాడలో బయటపడ్డాయి. జైనులు వీటిని ‘సర్వతోభద్ర’ అంటూ వ్యవహరిస్తారు. బౌద్ధుల తరహాలోనే జైనులు కూడా స్తూపాలు నిర్మించుకు నేవారని, గ్రామంలోని అంగడి వీరన్న శివాలయం ముందున్న శాసనాల ద్వారా తెలుస్తోంది.