calender_icon.png 19 April, 2025 | 8:06 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

27న చలో వరంగల్ రజతోత్సవ సభను విజయవంతం చేయాలి

16-04-2025 06:00:44 PM

మండల పార్టీ అధ్యక్షుడు గండ్ర మధుసూదన్ రావు..

కామారెడ్డి (విజయక్రాంతి): ఈనెల 27న వరంగల్లో నిర్వహించనున్న బీఆర్ఎస్ ఆవిర్భావ సదస్సుకు దోమకొండ మండలానికి చెందిన బీఆర్ఎస్ పార్టీ నేతలు, నాయకులు, కార్యకర్తలు, పెద్ద ఎత్తున తరలివచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ తలపెట్టిన ఏప్రిల్ 27న చలో వరంగల్ రజతోత్సవ సభను విజయవంతం చేయాలని మండల బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు గండ్ర మధుసూదన్ రావు అన్నారు. 

మండల కేంద్రంలోని పెఱిక సంఘంలో బుధవారం పార్టీ నాయకులతో కలిసి  పత్రికా సమావేశం (ప్రెస్ మీట్) ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పార్టీ సీనియర్ నాయకులు మాట్లాడుతూ... కాంగ్రెస్ ప్రభుత్వం అధికార వ్యామోహంతో ఎన్నో హామీలు ఇస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిందని... తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల పూర్తి అసహనంతో ఉన్నారని... ప్రజలందరూ కూడా మళ్ళీ కేసీఆర్ గారి పాలననే కోరుకుంటున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ AMC ఛైర్మెన్ కుంచాల శేఖర్, ముత్యంపేట్ సింగిల్ విండో ఛైర్మెన్ కొడిప్యాక తిరుపతి గౌడ్, మాజీ ఎంపీపీ కానుగంటి శారదా నాగరాజు, మాజీ ఎంపీటీసీ సభ్యులు కడారి రమేష్, మాజీ ఉప సర్పంచ్ గజవాడ శ్రీకాంత్, స్థానిక పట్టణ అధ్యక్షులు బోరెడ్డి కిషన్ రెడ్ది, పార్టీ సీనియర్ నాయకులు మండలంలోని అన్ని గ్రామాల పట్టణ అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.