17-04-2025 08:47:01 PM
మందమర్రి (విజయక్రాంతి): ఈనెల 27న జరిగే ఛలో వరంగల్ సభను విజయవంతం చేయాలని కోరుతూ బీఆర్ఎస్ నాయకులు కోరారు. ఈ మేరకు గురువారం పట్టణంలోని 4వ వార్డ్ ప్రాణహిత కాలనీలో ఛలో వరంగల్ వాల్ పోస్టర్లు అంటించారు. ఈ సందర్బంగా నాయకులు మాట్లాడుతూ... రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలులో పూర్తిగా విఫలమైందని మండిపడ్డారు. రజతోత్సవ సభలో రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ భవిష్యత్తులో చేపట్టబోయే ఆందోళన కార్యక్రమాలను రూపొందించడం జరుగుతుందన్నారు. ఈ రజతోత్సవ సభకు ప్రజలు, కార్యకర్తలు అధిక సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని కోరారు.
ఈ కార్యక్రమంలో టీబీజీకేఎస్ ఏరియా వైస్ ప్రెసిడెంట్ మేడిపల్లి సంపత్, 4వ వార్డు ప్రాణహిత కాలనీ వార్డు ఇంచార్జ్ తోట సురేందర్, యువ నాయకులు బట్టు రాజ్ కుమార్, వార్డు అధ్యక్షుడు సట్టు పోషం, నాయకులు రాజశేఖర్, బండారు సూరి బాబు, మద్ది శంకర్, పంజాల ఈశ్వర్, బర్ల సదానందం, తోట రాజిరెడ్డి, కోరబోయిన లక్ష్మణ్, కూడల తిరుపతి, బబ్బర మల్లేష్, శివ నాయక్, పూసల ఓదెలు, మొగురం శ్రీనివాస్, శేఖర్ యాదవ్, తోగరి లింగమూర్తి, యువ నాయకులు, ఎండి ముస్తఫా, అందే శ్రీకాంత్, పంబాల రవి, నరసయ్య, మహిళ నాయకురాలు, అక్కం సత్యవతి, పోషక్క, సఖి నాభి, అంజలి, సునీత, సోషల్ మీడియా ఇంచార్జీ సీపెల్లి సాగర్, యూత్ విద్యార్థి సోషల్ మీడియా నాయకులు పాల్గొన్నారు.