calender_icon.png 19 April, 2025 | 6:30 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఛలో వరంగల్ విజయవంతం చేయాలి

16-04-2025 04:41:37 PM

బీఆర్ఎస్వీ నాయకులు ముస్తఫా..

మందమర్రి (విజయక్రాంతి): ఈనెల 27న వరంగల్ జిల్లా ఎల్కతుర్తిలో జరగనున్న బీఆర్ఎస్ రజతోత్సవ సభను విజయవంతం చేయాలని బీఆర్ఎస్వీ జిల్లా నాయకులు ఎండి ముస్తఫా కోరారు. బుధవారం పట్టణంలోని 12, 13వ వార్డులలో చలో వరంగల్ పోస్టర్లను ఆవిష్కరించి ఆయన మాట్లాడారు. రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారెంటీలతో అధికారంలోకి వచ్చి హామీల అమలులో పూర్తిగా విఫలమైందని మండి పడ్డారు. రజతోత్సవ సభల్లో కాంగ్రెస్ ప్రభుత్వం అను సరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలు నిరసిస్తూ బీఆర్ఎస్ ఆధ్వర్యంలో చేపట్టనున్న ఆందోళన కార్యక్రమాలకు దిశ నిర్దేశం చేయడం జరుగుతుందని అన్నారు. ప్రజలు, బీఆర్ఎస్ అనుబంధ సంఘాల నాయకులు అధిక సంఖ్యలో హాజరై రజతోత్సవ సభను విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో వార్డు అధ్యక్షులు కాళోజీ అనిల్ కుమార్, నాయకులు కట్ల మోహన్, కుడికాల కల్పన, యశ్వంత్, కుడికాల శ్రీనివాస్, స్వాతి, సుశీల, కవిత, రాజేశ్వరి, రోజా, అభిషేక్, విశాల్, శ్రీనాథ్ లు పాల్గొన్నారు