25-04-2025 12:19:18 AM
సికింద్రాబాద్ ఎమ్మెల్యే తీగుళ్ల పద్మారావు గౌడ్
వారసిగూడ, ఏప్రిల్ 24 (విజయక్రాంతి) : బీ.ఆర్.ఎస్. నాయకత్వం నిర్వహించే ఛలో వరంగల్ కార్యక్రమానికి చారిత్రక ప్రాముఖ్యత ఉందని, ఈ కార్యక్రమాన్ని విజయ వంతం చేయాలని సికింద్రాబాద్ శాసనసభ్యులు, మాజీ డిప్యూటీ స్పీకర్ తీగుళ్ల పద్మారావుగౌడ్ అన్నారు. సీతాఫలమండీ లో ఆయన గురువారం ఇంటింటికీ తిరిగి ఛలో వరంగల్ కార్యక్రమం పోస్టర్లను ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ సికింద్రాబాద్‌లోని అడ్డగుట్ట, తార్నాక, మెట్టుగూడ, సితాఫలమండీ, బౌద్ధ నగర్ మున్సిపల్ డివిజన్ల లోని అన్ని బస్తీలు, కాలనీల నుంచి భారీగా తరలివేల్లెందుకు ప్రజలు స్వచ్చంధంగా ముందుకు వస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమాన్ని విజ యవంతం చేయాల్సి ఉందని తెలిపారు. కార్పొరేటర్లు సామల హేమ, కంది శైలజ, రాసురి సునీత, లింగాని ప్రసన్న లక్ష్మి శ్రీనివాస్, నేతలు రాజ సుందర్ తదితరులు పాల్గొన్నారు.