12-04-2025 07:55:20 PM
రామకృష్ణాపూర్ (విజయక్రాంతి): ఈ నెల 27న వరంగల్ ఎక్కతుర్తిలో నిర్వహించే బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ మహాసభను జయప్రదం చేయాలని బిఆర్ఎస్ మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ పిలుపునిచ్చారు. శనివారం క్యాతన్ పల్లిలోని తన నివాసంలో చలో వరంగల్ పోస్టర్లను ఆవిష్కరించిన అనంతరం ఆయన మాట్లాడారు. బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ మహాసభ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో నిర్వహించ నున్నట్లు తెలిపారు.
నియోజకవర్గం నుంచి వరంగల్ సభకు రవాణా సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. సభకు నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్దఎత్తున హాజరై సభను విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో చెన్నూరు నియోజక వర్గ ఇంచార్జ్ డాక్టర్ రాజా రమేష్, పట్టణ అధ్యక్షుడు సుదర్శన్ గౌడ్, పల్లె భూమేష్, వాలా శ్రీనివాసరావు, రిక్కుల మధుకర్ రెడ్డి, మేడి తిరుపతి, వేల్పుల రవి, రాంలాల్ గిల్దా, జాడి శ్రీనివాస్, రామిడి కుమార్, రెవెళ్లి ఓదేలు, అనిల్ రావు, గడ్డం రాజు తదితరులు పాల్గొన్నారు.