calender_icon.png 22 October, 2024 | 5:46 AM

డిసెంబర్ 5న చలో సచివాలయం

22-10-2024 02:39:35 AM

  1. కార్మికులకు ఇచ్చిన హామీలు అమలు చేయాలె
  2. ఆర్టీసీ యూనియన్ లీడర్ థామస్‌రెడ్డి 

హైదరాబాద్, అక్టోబర్ 21 (విజయక్రాంతి): ఆర్టీసీ కార్మికులపై కాంగ్రె స్ ప్రభుత్వ వైఖరికి నిరసనగా డిసెంబర్ 5న చలో సచివాలయం కార్యక్ర మం నిర్వహిస్తున్నట్లు ఆర్టీసీ యూనియన్ లీడర్ థామస్‌రెడ్డి తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన హామీలను 11 నెలలు కావస్తున్నా అమలు చేయకపోవడం తో కార్మికవర్గమంతా అసంతృప్తిలో ఉందని అన్నారు.

ఈ మేరకు సోమవారం ఒక ప్రకటనలో పేర్కొంటూ ప్రభుత్వ వైఖరికి నిరసనగా నవంబర్ 5న జిల్లా కలెక్టర్లకు వినతిపత్రాలు ఇస్తామని పేర్కొన్నారు. గతంలో మంత్రులు,ఉన్నతాధికారులు, సీఎం ను కలిసి పలు దఫాలుగా వినతిపత్రం అందజేసినా వారి నుంచి నేటివరకు ఎలాంటి స్పందన రాలేదన్నారు.

ఆర్టీ సీ ఉద్యోగులను ప్రభుత్వంలో వెంటనే విలీనం చేయాలని కోరారు. ఆర్టీసీ యూనియన్ల ఊసే ఎత్తడంలేదని, వెంటనే వాటిని పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. 2021 వేతన సవర ణ కాలపరిమితి నాలుగు సంవత్సరాలు గడుస్తున్నా ఇంతవరకు చేయలే దని వెంటనే అమలు చేయాలని కోరారు.