calender_icon.png 19 March, 2025 | 8:34 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

26న చలో రామోజీ ఫిలింసిటీ

19-03-2025 12:57:50 AM

- సీపీఐ జిల్లా కార్యదర్శి పి.యాదయ్య  

- రాయపోల్ గ్రామంలో సన్నాహక సమావేశం

ఇబ్రహీంపట్నం, మార్చి 18 (విజయ క్రాంతి): ఈ నెల 26న చలో రామోజీ ఫిలిం సిటీ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని, ఇండ్ల స్థలాల పట్టాలున్న పేదలకు సీపీఐఎం జిల్లా కార్యదర్శి యాదయ్య పిలుపునిచ్చారు. ఇబ్రహీంపట్నం మండల పరిధిలోని రాయపోల్ లో మంగళవారం జరిగిన ఇండ్ల స్థలాల పేదలతో సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం విధించే నిర్బంధాలు ఎదిరించి, రామోజీ యాజమాన్యం ఆక్రమించిన ఇండ స్థలాలను సాధిస్తామన్నారు.

రామోజీ ఆక్రమించిన స్థలాలకు విముక్తి కల్పిస్తామనీ, అందుకు వారం రోజుల ప్రభుత్వానికి గడువు ఇస్తున్నామన్నారు. ముదిగొండ అమరవీరుల త్యాగాల స్ఫూర్తితో 2007లో అప్పటి ప్రభుత్వం ఇళ్ల స్థలాలను నాగన్ పల్లి, పోల్కంపల్లి, రాయపోల్, ముకునూర్ గ్రామాల పేదలకు ఇండ్ల స్థలాల సర్టిఫికెట్లు జారీ చేసిందని, కానీ ఆ భూముల్లోకి వెళ్లకుండా రామోజీరావు యాజమాన్యం ఇండ్ల స్థలాల పేదలను అడ్డుకుంటుందన్నారు. పేదలు ఇండ్లు నిర్మించుకుంటామంటే అడుగడుగున అడ్డంకులు సృష్టిస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు.

పేదల కేటాయించి ఇండ్ల స్థానాలను వారికే అప్పజెప్పలని డిమాండ్ చేస్తూ దఫదఫాలుగా జిల్లా కలెక్టర్, ఆర్డీవో, ఇబ్రహీంపట్నం తహసిల్దార్లను కలిసి వినతి పత్రాలు అందజేశామన్నారు.  సీపీఐఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బి.సామెల్ మాట్లాడుతూ.. రా మోజీ ఫిలింసిటీ ఆక్రమించిన పేదల ఇండ్ల స్థలాలను వెంటనే విముక్తి కల్పించాలని డిమాండ్ చేశారు.  అప్పటి ప్రభుత్వం ఆ పోరాటానికి తలొగ్గి పేదలకు ఇంటి స్థలాలు ఇచ్చిందన్నారు. కానీ సర్టిఫికెట్లు ఇచ్చినా.. ఆ స్థలాల్లోకి పోనివ్వడం లేదన్నారు. గత ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి, ప్రస్తుత ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి రామోజీకే వత్తాసు పలుకుతున్నారని మండి పడ్డారు.  

రామోజీ ఫిలిం సిటీ ఇంటి స్థలాల పోరాట కమిటీ ఎన్నిక.. కన్వీనర్ గా పంది జగన్, కో కన్వీనర్ గా సిహెచ్ బుగ్గ రాములు కమిటీ సభ్యులుగా పెర్క యాదయ్య, అచ్చన రాములు, రాజుల రాణి, పాశం సుమలత, చెర్కురి బాల్ రాజ్, పి.ఎల్లమ్మ, ఓ.క్రిష్ణ, నౌసు సంతోష,పెద్దిగారి యాదయ్య, పలువురిని ఎన్నుకోవటం జరిగింది. ఈ కార్యక్రమంలో సీపీఐఎం జిల్లా కమిటీ సభ్యులు సీహెచ్ జంగయ్య,  మండల కార్యదర్శి వర్గ సభ్యులు టి.నర్సింహ, మండల కమిటీ సభ్యులు ఏ వెంకటేష్, సిహెచ్ నర్సింహ, ఎం.ఆనంద్ తదితరులు పాల్గొన్నారు.