calender_icon.png 6 April, 2025 | 1:51 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రేపు ఛలో రాజ్‌భవన్

17-12-2024 01:54:36 AM

* పీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్‌గౌడ్

హైదరాబాద్, డిసెంబర్ 16 (విజయక్రాంతి ) : అదానీపై ఆర్థిక అవకతవకలు, నేరారోపణలు, అవినీతి, మోసం, మనీలాండరింగ్ తదితర అంశాలపై కేంద్రం చర్యలు తీసుకోకపోవడానికి నిరసనగా బుధవారం ఛలో రాజ్‌భవన్ కార్యక్రమం చేపట్టనున్నట్లు పీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్‌గౌడ్ సోమవారం ఒక ప్రకటలో పేర్కొన్నారు. నెక్లెస్‌రోడ్డులోని ఇందిరాగాంధీ విగ్రహం వద్ద నుంచి రాజ్‌భవన్ వరకు జనంతో భారీ ర్యాలీ ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఏఐసీసీ ఇంచార్జి దీపాదాస్ మున్షీ, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, సీనియర్ నాయకులు హాజరవుతారన్నారు.