calender_icon.png 11 February, 2025 | 7:53 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చలో లాడ్ బజార్

09-02-2025 12:00:00 AM

మహిళలతో గాజులను విడదీయలేని సంబంధం ఉంటుంది. పెళ్లైన వారే కాదు.. పెళ్లి కాని అమ్మాయిలు సైతం రంగు రంగుల్లో ఉండే మనసైన గాజులను డజన్లకు డజన్లు కొనేస్తుంటారు. పెళ్లిళ్లు.. ఫంక్షన్లు వచ్చి నప్పుడు.. చీరకు లేదా డ్రెస్‌కు మ్యాచ్ అయ్యే గాజులను వేసుకుని మురిసిపోతుంటారు. మరి మగువల సున్నితమైన చేతులకు చక్కగా ఉండే గాజుల కు కేరాఫ్ అడ్రస్ లాడ్ బజార్.

ఇక్కడ దొరికే ‘లక్క గాజులంటే’ అమ్మాయిలకు తెగ ఇష్టం. ఏరికోరి ఎంత డబ్బైనా సరే వీటినే కొంటుంటారు. ఈ గాజులను లక్కతో తయారు చేస్తారు. ఈ లక్కను లాడ్ అని కూడా అంటారు. ఈ గాజులు అమ్మే ప్రాంతం కాబట్టి దానికి ‘లాడ్ బజార్’ అనే పేరు కూడా వచ్చింది.

చార్మినార్‌లో మట్టిగాజుల నుంచి మొదలు మెటల్ గాజుల వరకు తీరొక్క రంగుల్లో గాజులు లభిస్తాయి. అందులోనూ ఇవి మరీ ఎంత ఖరీదైనవో అనుకుంటే పొరపాటే. ఎందుకంటే ఇక్కడ గాజులు కేవలం ఐదు రూపాలయ నుంచి 15 వేల రూపాయల  ఖరీదైన గాజులు కూడా అందుబాటులో ఉంటాయి. ఇక్కడ తీరొక్క డిజైన్లతో మనసు మెచ్చే విధంగా మనకు అందుబాటులో ఉంటాయి.