బెల్లంపల్లి (విజయక్రాంతి): మారు పేర్ల కార్మికుల పిల్లలకు వెంటనే న్యాయం జరిగేలా చూడాలని డిమాండ్ చేస్తూ చలో కొత్తగూడెం యాత్రలో భాగంగా సోమవారం బెల్లంపల్లికి చేరుకున్న మారు పేర్ల నాయకులకు సింగరేణి ఆపరేటర్స్ అండ్ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు బిడ్డల విజయకుమార్ స్వాగతం పలికి మద్దతు తెలిపారు. బెల్లంపల్లి చిలక స్టేడియం నుండి అంబేద్కర్ చౌరస్తా వరకు ఈ యాత్ర కొనసాగింది. అనంతరం అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి మారుపేరుల సమస్యపై వినతిపత్రం ఇచ్చారు.
మారుపేర్ల సమస్యను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన మాటను నెరవేర్చుకోవాలని సింగరేణి ఆపరేటర్స్ అండ్ కార్మిక సంఘం సభ్యులు డిమాండ్ చేశారు. మారుపేర్ల సంఘం నాయకులు చేపట్టిన ఈ యాత్ర కొత్తగూడెం వరకు సరదాగా సాగేలా చూడాలని కోరారు. వీరి న్యాయమైన డిమాండ్ ను గుర్తింపు కార్మిక సంఘం ఏఐటియుసి స్ట్రక్చర్ మీటింగ్లో మాట్లాడి పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ యాత్రలో మారుపేర్ల సంఘం నాయకులు, ఎస్ ఓకే ఎస్, బి ఆర్ ఎస్ వి జిల్లా అధ్యక్షుడు బాడికల శ్రావణ్, ఇతర నాయకులు పాల్గొన్నారు.