calender_icon.png 1 January, 2025 | 6:22 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఛలో కరీంనగర్ విజయవంతం చేయాలి

29-12-2024 08:50:50 PM

డిజెఎఫ్ పోస్టర్ల ఆవిష్కరణ...

మందమర్రి (విజయక్రాంతి): కరీంనగర్ జిల్లా కేంద్రంలో జనవరి 10న నిర్వహించనున్న డెమోక్రటిక్ జర్నలిస్ట్ ఫెడరేషన్ (democratic journalist federation) మహాసభలకు జర్నలిస్టులు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని డీజేఎఫ్ జిల్లా అధ్యక్షులు మోకనపల్లి బద్రి కోరారు. పట్టణంలోని మార్కెట్ ఏరియాలో ఆదివారం మహాసభ పోస్టర్లను ఆవిష్కరించి మాట్లాడారు.  జాతీయ కమిటీగా ఏర్పాటైన డీజేఎఫ్ విలేకరుల హక్కుల కోసం పోరాడుతుందని ఆయన అన్నారు. విలేకరులకు ప్రభుత్వం నుండి రావలసిన ఉచిత విద్య, వైద్యం అనే నినాదంతో డిజెఎఫ్ జాతీయ అధ్యక్షుడు మానసాని కృష్ణారెడ్డి పిలుపు మేరకు కరీంనగర్ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేస్తున్న డిజెఎఫ్ మహాసభలకు జాతీయ, రాష్ట్ర, వివిధ జిల్లాల విలేకరులు అధిక సంఖ్యలో పాల్గొని విజయ వంతం చేయాలని కోరారు. డీజేఎఫ్ మండల అధ్యక్షులు బత్తుల సతీష్ బాబు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి పెండ్యాల గౌతమ్ చారి, ఉపాధ్యక్షులు శివరామకృష్ణ, కాగితపు శ్రీనివాస్, కార్యదర్శులు మాదంశెట్టి సురేష్ కుమార్, కాసర్ల కిరణ్ లు పాల్గొన్నారు.