calender_icon.png 24 November, 2024 | 5:14 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చలో హైదరాబాద్ విజయవంతం చేయండి

24-11-2024 02:39:01 PM

విహెచ్పీస్ జాతీయ కోర్ కమిటీ కో చైర్మన్ పెద్దపల్లి సత్యనారాయణ

మందమర్రి,(విజయక్రాంతి): హైదారాబాద్ లోని  ఇందిరాపార్క్ వద్ద ఈ నెల 26న జరుగనున్న చేయూత పెన్షన్ దారుల ధర్నా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని వికలాంగుల హక్కుల పోరాట సమితి (వీహెచ్పీఎస్) జాతీయ కోర్ కమిటీ కో చైర్మన్ పెద్దపల్లి సత్యనారాయణ కోరారు. పట్టణంలోని  అంబేద్కర్ విగ్రహం వద్ద ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలకు 2000 పించన్ ను  4000 పెంచాలని, దివ్యాంగులకు ఇస్తున్న పించన్  4000 నుండి 6000 లకు పెంచి వెంటనే అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

దివ్య్యంగులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాలని, ఇందిరమ్మ ఇళ్లలో ఐదు శాతం రిజర్వేషన్ అమలు చేయాలని కోరారు. పంచాయతీ నుండి పార్లమెంటు వరకు దివ్యాంగులకు రిజర్వేషన్ కల్పించి, 2016 దివ్యాంగుల చట్టం అన్ని శాఖలు అమలు చేయాలని ఆన్నారు. ఉద్యోగులకు ప్రమోషన్లలో రిజర్వేషన్ కల్పించాలని, నామినేటెడ్ పదవులలో దివ్యాంగులకు అవకాశం కల్పించాలని, రైలు బస్సులలో ఉచిత ప్రయాణ సౌకర్యం  కల్పించాలని కోరారు. దివ్యాంగుల న్యాయమైన హక్కుల సాధనకు చేపట్టనున్న ధర్నాలో జిల్లాలోని వృద్దులు, వితంతువులు, ఒంటరి మహిళలు, దివ్యాంగులు ఆసరా ఫించన్ దారులు అధిక సంఖ్యలో హాజరై ధర్నాను విజయవంతం చేయాలని ఆయన కోరారు.