calender_icon.png 13 February, 2025 | 9:36 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

16న చలో హైదరాబాద్ రాష్ట్ర సదస్సును జయప్రదం చేయాలి

13-02-2025 06:57:34 PM

వాల్ పోస్టర్స్ ఆవిష్కరిస్తున్న IFTU జిల్లా కార్యదర్శి బానోతు రాంసింగ్, కందగట్ల సురేందర్..

కొత్తగూడెం (విజయక్రాంతి): ఎన్నికల ముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారెంటీలను తక్షణమే అమలు చేయాలని కోరుతూ సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ఫిబ్రవరి 16న హైదరాబాదు ఓంకార్ బిల్డింగ్ లో తలపెట్టిన రాష్ట్ర సదస్సును జయప్రదం చేయాలని కోరుతూ ఐ ఎఫ్ టి యు జిల్లా కార్యదర్శి బానోత్ రాoసింగ్, సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ కొత్తగూడెం సబ్ డివిజన్ కమిటీ కార్యదర్శి కందగట్ల సురేందర్ లు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వారు మాట్లాడుతూ... కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపట్టి 16 నెలలు గడుస్తున్నప్పటికీ ఏ ఒక్క వాగ్దానం అమలు చేయకపోవడం శోచనీయమని అన్నారు.

రైతు బంధు, రైతుకు గిట్టుబాటు ధర, విద్యార్థి యువకులకు నిరుద్యోగ సమస్య, రైతు రుణమాఫీ, కళ్యాణ లక్ష్మి, పింఛన్ పెరుగుదల, అనేక విషయాలను బుట్టదాకాలు చేసి కాంగ్రెస్ ప్రభుత్వం లోటు బడ్జెట్ను చూపిస్తూ కాలయాపన చేస్తుందని ప్రభుత్వ తీరుపై ధ్వజమెత్తారు. ప్రభుత్వాలు, అధికారాలు మారుతున్నాయి తప్ప ప్రజల జీవితాలలో వెలుగు నింపే కార్యక్రమాలు ఏ ఒక్కటి అమలు కావటం లేదనీ విమర్శించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్పొరేటు వ్యవస్థను బలోపేతం చేయడానికి అలింగ శిష్యుల్లాగా పనిచేస్తున్నాయి తప్ప పేదల పక్షపాతిగా ప్రభుత్వాల తీరు ఉండకపోవడం బాధాకరమని అన్నారు. 

ప్రధానంగా సిపిఐఎంఎల్ న్యూడెమోక్రసీ గోదావరి పరివాహక ప్రాంతంలో 14 లక్షల ఎకరాలకు పైగా పోడు భూములను కొట్టించి ఆదివాసి పేదలకు పంచిపెట్టిన చరిత్ర, ఇల్లందులో ఆరు పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలిచిన చరిత్ర న్యూడెమోక్రసీ పార్టీకి ఉందని, ఈ సందర్భంగా గుర్తు చేస్తూ, పాలక ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను తిప్పి కొట్టాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పిఓడబ్ల్యూ జిల్లా నాయకురాలు నక్క లావణ్య, పిడిఎస్యు జిల్లా ప్రధాన కార్యదర్శి జే గణేష్, నాయకులు శ్రీను నాగేశ్వరావు, రాములు, నవీన్, కోటయ్య, వెంకన్న తదితరులు పాల్గొన్నారు.