చలో హైదరాబాద్ కార్యక్రమం విజయవంతం చేయాలి..
రామయంపేట: మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలో జిల్లా ఎమ్మార్పీఎస్ నాయకులు బుధవారం రోజు విలేకర్ల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మార్పీఎస్ సీనియర్ నాయకులు మాట్లాడుతూ.. ఎస్సీ వర్గీకరణ విషయంలో ఎస్సీ ఎస్టి రిజర్వేషన్లకు ఉప వర్గీకరణ రాష్ట్రాలు చేయొచ్చని సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ ఉద్యోగాల్లో ఎస్సీ ఎస్టీలకు కేటాయించిన రిజర్వేషన్లను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయాలని కోరుతూ ఎమ్మార్పీఎస్ రాష్ట్ర వ్యవస్థాపకులు మందకృష్ణ మాదిగ ఫిబ్రవరి 7వ తేదీన లక్ష డప్పులు - వెయ్యి గొంతులు చలో హైదరాబాద్ కార్యక్రమానికి ఉమ్మడి రామాయంపేట, నిజాంపేట మండలాల ఎమ్మార్పీఎస్ నాయకులు ఎస్సీలలో ఉన్న 59 మాదిగ ఉప కులాల నాయకులు హైదరాబాదులో జరిగే ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ రాష్ట్ర నాయకులు పాతూరి రాజు, రాష్ట్ర ఉపాధ్యక్షులు మసాయిపేట యాదగిరి, ఎమ్మార్పీఎస్ జిల్లా మాజీ అధ్యక్షులు మల్యాల కిషన్ తదితరులు పాల్గొన్నారు.