బీసీలకు భిక్ష కాదు.. హక్కు కావాలి
న్యాయం జరిగే వరకు ఉద్యమం
కులగణన చేపట్టకపోతే కాంగ్రెస్‌కూ కేసీఆర్ గతే
బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్
హైదరాబాద్, సెప్టెంబర్ 11 (విజయ క్రాంతి): ఈ నెల 25న వేలాది మందితో చలో హైదరాబాద్ కార్యక్రమానికి పిలుపునిచ్చినట్టు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్ స్పష్టం చేశారు.బుధవారం ప్రెస్‌క్లబ్‌లో మీడియాతో ఆయన మాట్లాడారు. బీసీలకు రిజర్వేషన్లు భిక్షగా కాకుండా రాజ్యాంగ హక్కుగా రావాలని స్పష్టం చేశారు. రిజర్వేషన్ల కోసం ఎన్నో పోరాటాలు చేశామని, బీసీలకు న్యాయం జరిగే వరకు ఉద్య మాన్ని ఆపేది లేదన్నారు.
మూడు నెలల్లో బీసీ గణన చేపట్టి బీసీ రిజర్వేషన్లను నిర్ధారించిన తర్వాతనే రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు తీర్పు ఇవ్వడాన్ని స్వాగతిస్తున్నామన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి జోక్యం చేసుకుని బీసీ రిజర్వేషన్లు పెంచిన తర్వాతనే స్థాని క ఎన్నికలు నిర్వహిస్తామని స్పష్టంగా ప్రకటించాలని విజ్ఞ ప్తి చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే సమగ్ర కులగణనను మొదలుపెట్టాలని డిమాండ్ చేశారు. కామారెడ్డి డిక్ల రేషన్ అమలు చేయకుండా లోకల్ ఎన్నికలను నిర్వహించాలని ప్రభుత్వం అధికారులకు ఆదేశాలిచ్చి ప్రక్రియ మొదలుపెట్టిందన్నారు.
ప్రభుత్వం ఏర్పడి 10 నెలలు గడుస్తున్నా కులగణనపై మార్గదర్శకాలు విడుదల చేయకుండా దాటవేత ధోరణి అవలంభిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. సమగ్ర కులగణనతోనే బీసీలకు న్యాయం జరుగుతుందన్నారు. ఈ విషయంలో నిర్లక్ష్యం చేస్తే కేసీఆర్‌కు పట్టిన గతే కాంగ్రెస్ ప్రభుత్వానికి పడుతుందని హెచ్చరించారు. కోర్టు తీర్పుతో రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలను అనివార్యంగా మూడు నెలలు వాయి దా వేయాల్సి వచ్చిందన్నారు. తప్పని పరిస్థితుల్లో కులగణన చేసిన తర్వాతనే స్థానిక ఎన్నికలు నిర్వహించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఏర్పడిందని తెలిపారు.
కులగణన చేయడం ద్వారా బీసీ రిజర్వేషన్లు పెంచుకునే అవకాశం ప్రభుత్వానికి ఉంటుందని పేర్కొన్నారు. హైకోర్టు ఆదేశాలను అమలు చేయాలని, లేనిపక్షంలో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ నెల 25 న వేలాది మందితో ఛలో హైదరాబాద్ కార్యక్రమానికి పిలుపునిచ్చినట్టు స్పష్టం చేశారు. కార్యక్రమంలో బీసీ కుల సంఘాల జేఏసీ చైర్మన్ కుందారం గణ్‌శ్ చారి, కన్వీనర్ బాలగోని బాలరాజు గౌడ్, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు కుల్కచర్ల శ్రీనివాస్ ముదిరాజ్, కనకాల శ్యాం కుర్మా, సంఘాల నాయకులు పాల్గొన్నారు.