21-03-2025 08:09:04 PM
మార్చి 24న చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని విజయవంతం చేయండి
మునుగోడు,(విజయక్రాంతి): గ్రామాలలో గర్భిణీ బాలింతలకు అర్థరాత్రి ఆపద వచ్చిన అమ్మల అన్ని తనవి చూసుకునే ఆశలకు నెలకు కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలని సీఐటీయు ఆశా యూనియన్ అధ్యక్షురాలు వనం నిర్మల(CITU ASHA Union President Vanam Nirmala) ప్రభుత్వాన్ని కోరారు. శుక్రవారం రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు మండల వైద్యాధికారికి పలు డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని అందజేసి మాట్లాడారు. ఆశాలను మూడవ ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో బడ్జెట్ సమావేశంలోనే ఆశలకు ఎన్ హెచ్ ఎం బడ్జెట్ను పెంచాలని కోరారు. మార్చి 24న హైదరాబాదులో నిర్వహించే చలో హైదరాబాద్ కార్యక్రమముకు వెళ్లేందుకు పర్మిషన్ ఇవ్వాలని కోరారు . ఈ కార్యక్రమంలో మమత,పద్మ ,పుష్పమ్మ ,కవిత,ధనలక్ష్మి,సైదమ్మ,గంగ, జ్యోతి,మమత,నాగమణి, కమలమ్మ ,వసుమతి, వరలక్ష్మి, ధర లక్ష్మి,అలివేలు,లింగమ్మ,ఇందిరమ్మ , కమల,వసంత,సుజాత,రాణి,యాదమ్మ ఉన్నారు.