25-03-2025 08:17:00 PM
బుర్రి శ్రీరాములు సిపిఎం పార్టీ మండల కార్యదర్శి..
మునగాల: కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని 26న సిపిఎం పోరుబాట చలో కలెక్టరేట్ ముందు ధర్నాకు ప్రజల అధిక సంఖ్యలో పాల్గొనలని సిపిఎం పార్టీ మండల కార్యదర్శి బుర్రి శ్రీరాములు ప్రజలకు పిలుపునిచ్చారు. మంగళవారం సిపిఎం స్థానిక సిపిఎం పార్టీ సుందరయ్య స్మారక భవనములో ముఖ్య కార్యకర్తల సమావేశం చందా చంద్రయ్య అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా బుర్రి శ్రీరాములు మాట్లాడుతూ... రైతులకు ఎన్నికల ముందు రెండు లక్షల రుణమాఫీ చేస్తానని, కొత్త రేషన్ కార్డులు ఇస్తామని, వృద్ధులకు, వితంతువులకు పెన్షన్లు ఇస్తామని, ప్రజా పాలనలో దరఖాస్తు చేసుకున్న ప్రతి సమస్యను పరిష్కరిస్తామని మాటలు చెప్పటం తప్ప పరిష్కారం చూపలేదని అన్నారు.
ఎస్సారెస్పీ కాలువ కింద ఎండిపోయిన పంట పొలాలను పరిశీలన చేసే ప్రయత్నం ఇంతవరకు ప్రభుత్వం చేయలేదని వెంటనే ప్రభుత్వం స్పందించి ఎండిపోయిన పంట పొలాలను పరిశీలించి ఎకరానికి 30 వేల రూపాయలు నష్టపరిహారం ఇవ్వాలని, ఇందిరమ్మ ఇండ్లు అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి ఇవ్వాలని, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ఉపాధి హామీ పనితో సంబంధం లేకుండా 12 వేల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ రేపు కలెక్టరేట్ ముందు జరగబోయే ధర్నాకు ప్రజల అధిక సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు బచ్చలకూర స్వరాజ్యం మండల కమిటీ సభ్యులు బోళ్ల కృష్ణారెడ్డి, మండవ వెంకటాద్రి, మామిడి గోపయ్య, వీరబోయిన వెంకన్న, ఎర్రవెల్లి ఎంకన్న, తదితరులు పాల్గొన్నారు.