ఆహారం, ఇంధనం, ఎరువుల సంక్షోభం
పరిష్కారం చూపాల్సిన బాధ్యత జీ
అప్పుడే మన చర్చలు సఫలమవుతాయి
జీ సదస్సులో ప్రధాని నరేంద్ర మోదీ
రియోడీజనీరో, నవంబర్ 18: ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న ఘర్షణలు, ఉద్రిక్తతలతో ఆహా రం, ఇంధనం, ఎరువుల సంక్షోభం దక్షిణాది దేశాలపై తీవ్ర ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఈ సమస్య లను పరిష్కరించడంపై జీ ప్రత్యేకంగా దృష్టి సారించాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు. బ్రెజిల్‌లోని రియోడీజనీరో నగరంలోని మ్యూజియం ఆఫ్ మోడర్న్ ఆర్ట్ భవనంలో సోమవారం జరిగిన జీ దేశాల శిఖరాగ్ర సదస్సులో మోదీ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా భారత్ వైఖరిని వినిపిస్తూ.. గతేడాది భారత్‌లో జీ సదస్సును నిర్వహించి నప్పుడు ఒక భూమి, ఒక కుటుంబం, ఒక భవిష్యత్తు నేపథ్యంగా తీసుకున్నాం. ప్రస్తుత సదస్సు కూడా అదే మంత్రాన్ని అనుసరిస్తోంది. ప్రపంచదేశాల మధ్య వైరుధ్యాలు, ఘర్షణలతో ఆహారం, ఇంధనం, ఎరువుల సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. వీటి ప్రభావం గ్లోబల్ సౌత్‌పై అధికంగా పడుతోంది. ఈ సవాళ్లను పరిష్కరించడంపై దృష్టి కేంద్రీకరించినప్పుడే మన చర్చలు విజయవంతమవుతాయి అని మోదీ పేర్కొన్నారు.
మోదీకి బ్రెజిల్‌లో ఘనస్వాగతం
జీ సదస్సులో పాల్గొనేందుకు బ్రెజిల్‌కు చేరుకున్న మోదీకి రియో డిజనీరో ఎయిర్‌పోర్ట్‌లో ఘనస్వాగతం లభించింది. అక్కడి నుంచి సదస్సు జరిగే ప్రాంగణానికి చేరుకున్న అనంతరం బ్రెజిల్ అధ్యక్షుడు లులా డసిల్వా మోదీకి ప్రత్యేక స్వాగతం పలికారు. మోదీపై చేతులు వేసి మరీ మాట్లాడారు. అనంతరం అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, ఐరాస చీఫ్ గుటెరస్‌తో మోదీ ముచ్చటించారు.
ప్రపంచ సంస్థల్లోనూ సంస్కరణలు రావాలి
ఢిల్లీ సదస్సులో ఆఫ్రికన్ యూనియన్‌కు జీ శాశ్వత సభ్యత్వాన్ని మంజూరు చేశామని ఈ సందర్భంగా మోదీ గుర్తుచేశారు. దీని ద్వారా గ్లోబల్ సౌత్ స్వరాన్ని విస్తరించామని, అదేవిధంగా ప్రపంచ సంస్థల్లోనూ సంస్కరణలు రావాలని మోదీ స్పష్టం చేశారు. జీసూ20 సదస్సుకు ఈ ఏడాది ఆతిథ్యమిచ్చిన బ్రెజిన్ ప్రభుత్వాన్ని మోదీ ప్రశంసించారు. ఆకలి, పేదరికం లేని ప్రపంచం కోసం బ్రెజిల్ చూపిస్తున్న చొరవకు భారత్ ఎప్పుడూ మద్దతు ఇస్తుంది.
ఢిల్లీలో తీసుకున్న ప్రజా కేంద్రీకృత నిర్ణయాలను బ్రెజిల్ అధ్యక్షుడు ముందుకు తీసుకెళ్లారు. సుస్థిర అభివృద్ధి లక్ష్యాలకు ప్రాధాన్యం ఇవ్వడం చాలా సంతృప్తి కలిగించే అంశం. మేం ప్రధానంగా సమ్మిళిత అభివృద్ధి, మహిళా సాధికారత సహా యువశక్తిపై ప్రత్యేకంగా దృష్టి సారించాం అని మోదీ వ్యాఖ్యానించారు.