calender_icon.png 4 February, 2025 | 6:19 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఫీజు కడితేనే ‘కీ’పై సవాల్

04-02-2025 01:41:41 AM

  • ఎంట్రెన్స్ ‘కీ’లో అభ్యంతరాలకు ఒక్కో ప్రశ్నకు రూ.500 
  • నీట్, జేఈఈల్లో ఒక్కో ప్రశ్నకు రెండొందలే
  • ఉన్నత విద్యామండలి వివాదాస్పద నిర్ణయం

హైదరాబాద్, ఫిబ్రవరి 3 (విజయక్రాంతి): తెలంగాణ ఉన్నత విద్యామండలి ఓ వివాదాస్పద నిర్ణయం తీసుకుంది. ఇంజినీరింగ్ సహా ఇతర ప్రవేశ పరీక్షల ‘కీ’లో అభ్యంతరాలకు ఒక్కో ప్రశ్నకు రూ. 500 ఫీజు వసూలు చేయనుంది. ఇలా ఒక విద్యా ర్థి సుమారు 10 ప్రశ్నల ఆన్సర్లను సవాల్‌చేస్తే అక్షరాలా ఐదు వేలు సమర్పిం చుకోవాల్సిందే.

జాతీయంగా నిర్వహించే నీట్, జేఈఈ వంటి పరీక్షల్లో ఆన్సర్ కీ చాలెంజ్‌లో ఒక్కో ప్రశ్నకు రూ.200 మాత్ర మే వసూలు చేస్తుండగా, మన దగ్గర మాత్రం ఒక్కో ప్రశ్నకు రూ.500 ఫీజుగా నిర్ణయించారు. ఒకవేళ ఎవరైనా విద్యార్థి 160 ప్రశ్నలను సవాల్ చేయాలనుకుంటే ఏకంగా రూ.80వేలు సమర్పించుకోవాల్సిందే. ఇలా ఎన్ని ప్రశ్నలను సవాల్‌చేస్తే అంత మొత్తాన్ని చెల్లించాల్సి ఉంటుంది. 

తొలిసారిగా ఏడు ఎంట్రెన్స్‌ల్లో..

ప్రాథమిక ‘కీ’పై అభ్యంతరాలకు ఫీజులు వసూలు చేసే విధానం ఇదివరకెప్పుడు మన వద్ద లేదు. ఈసారి నుంచే తొలిసారిగా అమలుచేయాలని నిర్ణ యం తీసుకున్నారు. ఎప్‌సెట్, ఐసెట్, పీజీఈసెట్, ఎడ్‌సెట్ సహా 7 ప్రవేశ పరీక్షల్లో ఈ విధానం అమలుచేయాల ని నిర్ణయించారు.

పరీక్ష ఫీజులు కట్టడానికే నానా కష్టాలు పడుతున్న విద్యార్థు లు తాజా విధానంతో మరింత ఇబ్బందిపడనున్నారు. అయితే ఇది పూర్తిగా రీఫండబుల్ ఫీజు అని అధికారులు తెలిపారు. ఒక ప్రశ్నపై అభ్యంతరం వ్యక్తం చేసిన పక్షంలో ప్రాథమిక కీలో వెల్లడించిన ఆన్సర్ తప్పు అని తేలితే విద్యార్థి చెల్లించిన ఫీజు మొత్తాన్ని తిరిగి ఇచ్చేస్తారు. ఆన్సర్ మారకపోతే ఫీజు వాపస్ చెల్లించరు. ఈ విధానాన్ని విద్యార్థి సం ఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి.