calender_icon.png 10 March, 2025 | 6:33 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మైసిగండి మైసమ్మతల్లిని దర్శించుకున్న చల్లా వంశీచంద్‌రెడ్డి

10-03-2025 12:42:14 AM

కడ్తాల్, మార్చి 9 (విజయక్రాంతి) : కడ్తాల్ మండలం  మైసిగండి మైసమ్మ అమ్మవారిని ఆదివారం  సిడబ్ల్యూ సీ ప్రత్యేక ఆహ్వానితులు, కల్వకుర్తి మాజీ శాసనసభ్యులు చల్లా వంశీచంద్ రెడ్డి దర్శించుకున్నారు. ఆలయంలో అయన ప్రత్యేక పూజలు చేశారు.

అయన వెంట  పీసీసీ సభ్యులు శ్రీనివాస్ గౌడ్, డిసిసి అధికార ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు యాట నర్సింహా, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బీచ్యా నాయక్, అమనగల్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్, హన్మ నాయక్, చేగూరి వెంకటేష్, హీరా సింగ్, బాల్ రాజు, అజీమ్, వస్ఫూల శ్రీశైలం, డిసిసి కార్యదర్శి రవీందర్ యాదవ్, వస్ఫూల శ్రీకాంత్, మహేష్, రామకృష్ణ, క్యామ శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.