calender_icon.png 15 January, 2025 | 12:27 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎస్బీఐ చైర్మన్‌గా చల్లా శ్రీనివాసులు శెట్టి

08-08-2024 02:44:41 AM

నియమిస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు జారీ

హైదరాబాద్, ఆగస్టు 7: బ్యాంకింగ్ దిగ్గ జం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) చైర్మన్‌గా చల్లా శ్రీనివాసులు శెట్టిని కేంద్ర ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు కేం ద్రం ఉత్తర్వులు జారీచేసింది. శెట్టి మూడేండ్ల కాలానికి ఎస్బీఐ చైర్మన్‌గా నియమించా లన్న ఫైనాన్షియల్ సర్వీసుల శాఖ ప్రతిపా దనను నియామకాల క్యాబినెట్ కమిటీ ఆమోదించినట్లు ప్రభుత్వ ఉత్తర్వుల్లో పేర్కొ న్నారు. ఎస్బీఐ ప్రస్తుత చైర్మన్ దినేశ్ ఖారా ఆగస్టు 28న పదవీ విరమణ చేయను న్నారు. చైర్మన్ పదవికి గరిష్ఠ వయో పరిమి తి 63 ఏండ్లుకాగా, ఆ తేదీనాటికి ఖారాకు 63 ఏండ్లు నిండుతాయి. తాజా ఎస్బీఐ మేనేజింగ్ డైరెక్టర్‌గా రానా అషుతోష్‌కుమా ర్‌ను ప్రభుత్వం నియమించింది. 

గద్వాల నుంచి..

తెలంగాణలో గద్వాల బిడ్డ అయిన శ్రీని వాసులు శెట్టి కేంద్ర ప్రభుత్వం ఏర్పాటుచేసి న వివిధ టాస్క్‌ఫోర్స్‌లు, కమిటీలకు కూడా నేతృత్వం వహించారు. ఎస్బీఐ రిటైల్, డిజిట ల్ బ్యాంకింగ్ పోర్ట్‌ఫోలియోను ప్రస్తుతం ఆయన పర్యవేక్షిస్తున్నారు. ఇండియన్ ఇని స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకర్స్ సర్టిఫైడ్ అసోసి యేట్ అయిన శెట్టి అగ్రికల్చర్ బీఎస్‌ఈ పట్టా తీసుకున్నారు. 1988లో ఎస్బీఐలో ప్రొబేషనరీ ఆఫీసర్‌గా వృత్తి జీవితాన్ని ప్రారంభించారు. 

శెట్టి నియామకంపై చిన్నారెడ్డి హర్షం

ఎస్బీఐ చైర్మన్‌గా చల్లా శ్రీనివాసులు శెట్టి నియామకం పట్ల రాష్ట్ర ప్రణాళిక సంఘం వైఎస్ చైర్మన్ చిన్నారెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా, ప్రస్తుత జోగులాంబ గద్వాల జిల్లాకు చెందిన శ్రీనివాసులు అత్యున్నత స్థానానికి చేరుకోవడం రాష్ట్రానికి, జిల్లాకు గర్వకారణం అన్నారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఎస్బీఐ చైర్మన్‌గా శ్రీనివాసులు హయాంలో రాష్ట్రానికి నిధులు విరివిగా వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు.