calender_icon.png 21 March, 2025 | 10:29 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

స్వచ్ఛమైన త్రాగునీరును అందించాలి

21-03-2025 06:17:31 PM

చిట్యాల,(విజయక్రాంతి): అంగన్వాడీ కేంద్రంలో చలివేంద్రన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమని, స్వచ్ఛమైన నీటిని అందించాలని అంగన్వాడి సూపర్వైజర్ జయప్రద(Anganwadi Supervisor Jayaprada) అన్నారు. శుక్రవారం మండలంలోని కొత్తపేట అంగన్వాడీ కేంద్రంలో అంగన్వాడి టీచర్ ఉమాదేవి(Anganwadi Teacher Umadevi) ఆధ్వర్యంలో చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జయప్రద హాజరై మాట్లాడారు. ప్రతిరోజు ఒకే రకమైన నీటిని కుండలలో వాడాలని, దీనివల్ల గర్భిణీలకు, పిల్లలకు సమస్యలు తలెత్తవని సూచించారు. సొంత ఖర్చులతో చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడం గొప్ప విషయమని ప్రశంసించారు.ఈ కార్యక్రమంలో అంగన్వాడీ ఆయా మల్లమ్మ తదితరులు పాల్గొన్నారు.