20-03-2025 09:20:39 AM
జిల్లా అదనపు కలెక్టర్ శ్రీజ చేతుల మీదుగా ప్రారంభించే అవకాశం..
వైరా, విజయక్రాంతి: వైరాలో మున్సిపాలిటీ ఆధ్వర్యంలో ఆరు చోట్ల చలివేంద్రాలు ఏర్పాటు చేశారు. గురువారం కేంద్రాల ప్రారంభానికి ముస్తాబు చేశారు. ఖమ్మం జిల్లా అదనపు కలెక్టర్ శ్రీజ వైరాను సందర్శించనున్నారు. కలెక్టర్ శ్రీజ చేతులు మీదుగా చలివేంద్రాన్ని ప్రారంభించే అవకాశం ఉంది వైరా మున్సిపాలిటీలో రివ్యూ మీటింగ్ ను కూడా ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం. వేసవి కాలంలో ప్రజల దాహార్తి తీర్చేందుకు ప్రతి ఏడాది మాదిరిగానే చలివేంద్రాల్లో ఏర్పాటు చేయడం జరిగిందని వైరా కొత్త బస్టాండ్, పాత బస్టాండ్, బ్యాంకు వద్ద, పల్లిపాడు, జనం రద్దీగా ఉన్న పలు రెండు చోట్ల చలివేంద్రాన్ని ఏర్పాటు చేశామనని వైరా మున్సిపల్ కమిషనర్ వేణు తెలిపారు