calender_icon.png 1 April, 2025 | 2:42 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కొండాపూర్ ఎంపీడీవో ఆధ్వర్యంలో చలివేంద్ర ప్రారంభం

29-03-2025 03:39:59 PM

కొండాపూర్: కొండాపూర్ మండల కేంద్రంలో ప్రధాన రోడ్డు పక్కన చలివేంద్రం ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా ఎంపీడీవో శ్రీనివాస్ మాట్లాడుతూ వేసవి బారి నుంచి ప్రజలు తమకు తాముగా రక్షించుకోవాలని డాక్టర్లు చెప్పే సూచనలు పాటించాలని, అత్యవసర సమయాల్లో మాత్రమే బయటికి వెళ్లాలని, బయటికి వెళ్లేటప్పుడు ఒక టవలు లేదా గొడుగును వాడాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో స్పెషల్ ఆఫీసర్ ( ఉప తహసిల్దార్) మర్రి ప్రదీప్ కుమార్, కొండాపూర్ పంచాయతి సెక్రటరీ ఓం ప్రకాష్, కొండాపూర్ మాజీ సర్పంచ్, పంచాయతీ సిబ్బంది  తదితరులు పాల్గొన్నారు.