calender_icon.png 14 October, 2024 | 8:42 AM

శ్రీవారికి వైభవంగా చక్రస్నానం

14-10-2024 04:05:42 AM

ముగిసిన సాలకట్ల బ్రహ్మోత్సవాలు

తిరుపతి, అక్టోబర్ 13: సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా చివరిరోజైన శనివారం తిరుమలలో వైభవంగా చక్రస్నానం నిర్వహించారు. రాత్రి 7 గంటలకు నిర్వహించిన ధ్వజావరోహణంతో ఉత్సవాలు ముగిశాయి. ఉదయం భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారు. ఆలయంలో 8 రోజులుగా మలయప్పస్వామికి వివిధ వాహన సేవలు నిర్వహించారు.

అక్టోబర్ 4న ప్రారంభమైన బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీవారు భక్తులకు వివిధ రూపాల్లో అభయమిచ్చారు. శనివారం విజయదశమి నేపథ్యంలో ఆలయానికి భక్తులు పెద్దఎత్తున తరలివచ్చారు. భక్తుల కోసం టీటీడీ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. తిరుమల శ్రీవారికి ఆదివారం సాయంత్రం భాగ్‌సవారి ఉత్సవం నిర్వహించారు.

బ్రహ్మోత్సవాలు ముగిసిన మరుసటి రోజు ఈ ఉత్సవాన్ని నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. భాగ్‌సవారి ఉత్సవంలో చిన్నజీయర్‌స్వామి, టీటీడీ అడిషన్ ఈవో సీహెచ్ వెంకయ్య చౌదరి దంపతులు, ఆలయ అధికారులు, శ్రీవారి భక్తులు పాల్గొన్నారు.