calender_icon.png 10 March, 2025 | 3:21 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

శ్రీవారు పుష్కరిలో చక్రస్నానం

09-03-2025 07:36:38 PM

బాన్సువాడ (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా బాన్సువాడ డివిజన్ బీర్కూరు మండలం శివారులోని (తిమ్మాపూర్) తెలంగాణ తిరుమల దేవస్థానము (టిటిడి) నందు జరుగుతున్న శ్రీలక్ష్మీ గోదా సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దశమ వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా ఆదివారము చివరిరోజు సందర్భంగా శ్రీవారు పుష్కరీలో చక్రస్నానం కార్యక్రమంలో కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొన్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు, బాన్సువాడ నియోజకవర్గ శాసనసభ్యులు పోచారం శ్రీనివాస రెడ్డి, పోచారం శంభు రెడ్డి, పోచారం సురేందర్ రెడ్డి కూడా పాల్గొన్నారు. స్వామి వారిని పుష్కరీలో చక్రస్నానం అనంతరం పోచారం శ్రీనివాస రెడ్డి, కుటుంబ సభ్యులతో కలిసి పుష్కరీలో దిగి స్నానం చేశారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ప్రజాప్రతినిధులు, నాయకులు, భారీ ఎత్తున భక్తులు ఈ బ్రహ్మోత్సవాలలో పాల్గొన్నారు.