calender_icon.png 1 October, 2024 | 9:42 AM

ఐలమ్మ మహిళ శక్తికి స్ఫూర్తిదాయకం

26-09-2024 12:14:37 PM

నివాళులర్పిస్తున్న పోలీసులు

సిద్దిపేట (విజయక్రాంతి): వీరనారి చాకలి ఐలమ్మ జయంతి పురస్కరించుకొని గురువారం సిద్దిపేట పోలీస్ కమిషనర్ కార్యాలయంలో ఐలమ్మ ఫోటోకు పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా అడిషనల్ డీసీపీ యస్. మల్లారెడ్డి మాట్లాడారు. భూస్వాములకు వ్యతిరేకంగా వీరనారి చాకలి ఐలమ్మ తన పోరాటంలో అనేక ఇబ్బందులు ఎదురైనా ముక్కోవని ధైర్యంతో రోకలి బండ చేతబూని దొరలపై పోరాడి ఎదిరించిన ఐలమ్మ మహిళ శక్తికి స్ఫూర్తిదాయకమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో టాస్క్ ఫోర్స్ ఏసిపి రవీందర్, ఏఓ యాదమ్మ, ఇన్స్పెక్టర్లు రామకృష్ణ, కమలాకర్, శ్రీధర్ గౌడ్, మల్లేశం గౌడ్, సైదా, పూర్ణచందర్, ఎస్ఐలు రఘుపతి, మహేష్, యాదవ రెడ్డి, ఏఎస్ఐ పద్మారావు, సూపరిండెంట్లు ఫయాజుద్దీన్, అబ్దుల్ ఆజాద్, అలీషా, కార్యాలయ అధికారులు, సిబ్బంది  పుష్పాలు వేసి నివాళులర్పించారు.